
కొత్తగూడ మండలం బుర్కగుంపునకు చెందిన మల్యాల నరసయ్య తనకు ఉన్న కొంత భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. అయితే యూరియా బస్తాల కోసం గత నెల రోజులుగా చెప్పులరిగేలా తిరుగుతున్నాడు. కానీ ఒక్క బస్తా కూడా యూరియా దొరకడం లేదు. దీంతో కళ్ల ముందే పంట ఆగమవుతుంటే నరసయ్య తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపంతో శనివారం నాడు తన పొలంలోనే పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది.