
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన అకౌంట్లను ఫాలో అయ్యే వారు కోట్లలో ఉన్నారు. మార్చి 2న 3,000 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న వనతారా వన్యప్రాణుల రక్షణ, పునరావాస కేంద్రాన్ని మోదీ సందర్శించిన వీడియోను యూట్యూబ్ ఛానెల్లో దాదాపు 50.4 కోట్ల మంది వీక్షించారు. అంటే ఈ ఒక్క వీడియో ద్వారనే ప్రధాని మోదీ కోటి రూపాయలకు పైగా సంపాదించారని చెప్పవచ్చు.