
యూజీసీ నెట్ డిసెంబర్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా ప్రారంభించింది. దేశంలోని యూనివర్శిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్, జూనియర్ రీసెర్ట్ ఫెలోషిప్ కోసం అర్హతను సాధించేందుకు జాతీయ స్థాయిలో ఈ పరీక్ష నిర్వహించనుంది. నెట్ డిసెంబర్ 2025 కోసం అధికారిక వెబ్సైట్ ugcnet.nta.ac.inలో రిజిస్ట్రేషన్ విండోను తెరిచారు. అర్హత కలిగిన వారు ఆన్లైన్ విధానంలో నవంబర్ 7, 2025 రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.