
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నివసిస్తున్న భారతీయుడు జాక్‌పాట్ కొట్టాడు. సెప్టెంబర్ 3న జరిగిన అబుదాబి బిగ్ టికెట్ సిరీస్ 278 డ్రాలో సుమారు రూ.35 కోట్లు గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకున్నాడు. బిగ్ టికెట్ నిర్వహకుల నుంచి ఈ ఫోన్ కాల్ అందుకున్న సందీప్ కుమార్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. భారత్‌లో ఉన్న తన కుటుంబాన్ని పోషించడానికి, ముఖ్యంగా తన తండ్రి ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపాడు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత సొంత వ్యాపారం ప్రారంభిస్తానని చెప్పాడు.