రష్యా-ఉక్రెయిన్ వివాదం మూడేళ్లుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో రెండు దేశాలు కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యాయి. టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరిగాయని ఉక్రెయిన్ జాతీయ భద్రత, రక్షణ మండలి కార్యదర్శి రుస్తం ఉమెరోవ్ శనివారం తెలిపారు. 2022లో ఇస్తాంబుల్లో ఏర్పాటు చేసిన ఖైదీల మార్పిడికి సంబంధించిన నియమాలను అమలు చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. తుది సాంకేతిక, విధానపరమైన నిర్ణయాలు త్వరలో తీసుకుంటామని ఉమెరోవ్ చెప్పారు.

