మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలను చల్లబరిచే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక చారిత్రాత్మక ముందడుగు వేశారు. ఇజ్రాయెల్ – లెబనాన్ దేశాల మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న వైరాన్ని పక్కన పెట్టి, ఇరు దేశాలు వాషింగ్టన్లో ముఖాముఖి చర్చలు జరపడం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా మారింది. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య నెల రోజులకు పైగా భీకర యుద్ధం సాగింది.

