హైదరాబాద్‌లోని మక్కా మసీదులో జరిగిన సభలో ప్రధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వెస్ట్ ఆసియా యుద్ధంపై భారత్ ఓపెన్‌గా వ్యతిరేకంగా మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో భారత్ న్యూట్రల్‌గా వ్యవహరించేదని, కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని మరియు అమెరికా మాజీ అధ్యక్షుడుతో దగ్గరగా ఉండటం వల్ల ప్రభావం తగ్గిందని విమర్శించారు. ఇరాన్, ఖతర్ వంటి దేశాల్లో పని చేస్తున్న భారతీయుల భవిష్యత్తు గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల అక్కడి పరిస్థితులు మారితే భారతీయుల జీవనోపాధిపై ప్రభావం పడుతుందని తెలిపారు.

