
టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధ AI ఆధిపత్య పోరు మరింత తీవ్రరూపం దాల్చింది. టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, టెక్ దిగ్గజం యాపిల్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ న్యాయపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించారు.
యాపిల్ తన యాప్ స్టోర్‌లో ఓపెన్ఏఐకి చెందిన చాట్‌జీపీటీకి అనైతికంగా కొమ్ముకాస్తోందని, ఇది తమ సొంత ఏఐ స్టార్టప్ ‘ఎక్స్ఏఐ’ ఎదుగుదలను అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు.