రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. సంగీత పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారాయన. అందులో భాగంగా మంచు మనోజ్ తన కొత్త మ్యూజిక్ ప్రాజెక్ట్ ‘మోహన రాగ మ్యూజిక్’ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటం, ప్రయోగాత్మక సంగీతాన్ని ప్రోత్సహించటం..భారతీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా సరికొత్త సంగీతాన్ని రూపొందించటమే దీని ప్రధాన లక్ష్యం.

