
భారతీయ సినీ రంగంలో అత్యున్నత గౌరవంగా భావించే పురష్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే’. 2023 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్‌కు ప్రకటించింది.నాలుగున్నర దశాబ్దాలుగా భారతీయ చిత్ర పరిశ్రమలకు ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించనున్నారు. భారతీయ చలన చిత్రరంగానికి మోహన్‌లాల్ ఆదర్శవంతమైన సేవలను అందించారని.. ఆయన అద్భుతమైన ప్రతిభ, కృషి, పట్టుదల సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని కేంద్ర సమాచార శాఖ కొనిడియాడింది.