
కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొత్త వివాదానికి తెర తీశారు. ఈ దేశానికి అంతర్గత టెర్రరిస్ట్ ప్రధాని మోదీ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో వివాదాస్పదమవుతున్నాయి. కాశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖవాసి చంద్రమౌళి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన YS షర్మిల అనంతరం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, భద్రతా లోపాల వల్లనే ఇంత పెద్ద మారణకాండ జరిగిందని YS షర్మిల రెడ్డి అన్నారు. ఉగ్రవాదులు వచ్చి ఇంత మంది టూరిస్ట్ లను చంపుతూ ఉంటే కనీసం అడ్డుకునేవాళ్ళు లేకుండా పోయారని,