మొక్కజొన్న రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నెల్లికొండ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. తూకం వేసిన ధాన్యాన్ని తరలించాలని మూడురోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నానని, తూకం చేసిన ధాన్యానికి రైతు నుంచి వేలిముద్ర వేయించుకోకుండా కాపలాగా ఉంచడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దె వాహనాల్లో మక్కలు తీసుకొచ్చిన రైతులకు కిరాయి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విమరించారు.

