మొంథా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా నష్టం సంభవించిందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాథమిక నివేదికను సమర్పించింది. నివేదిక ప్రకారం, 17 శాఖలు, రంగాలకు సంబంధించిన మొత్తం నష్టం రూ.5,244 కోట్లుగా అంచనా చేశారు. మొత్తం 249 మండలాల పరిధిలోని 1,434 గ్రామాలు, 48 పట్టణాలు తుపానుతో ప్రభావితమయ్యాయి. 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. 4,794 కి.మీ. ఆర్ అండ్ బీ రహదారులు, 311 కల్వర్టులు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి.

