మొంథా తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తుపాన్ ఎఫెక్ట్‌పై సంబంధిత అధికారులతో బుధవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వరిధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లో లెవల్ బ్రిడ్జీలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలను పూర్తిగా నిషేధించాలని, వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని దిశానిర్దేశం చేశారు.

