మొంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజల ప్రాణ మరియు ఆస్తి భద్రతను కాపాడే లక్ష్యంతో… నేషనల్ హైవే–16పై అన్ని రకాల వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపి వేశారు అధికారులు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇది కొనసాగుతుందని.. అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ తెలిపారు. తుఫాన్ తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, భారీ వర్షాలు మరియు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున వాహనదారులు తమ భద్రత కోసం సమీపంలోని పార్కింగ్ బేలు లేదా సురక్షిత ప్రదేశాల్లో వాహనాలు నిలిపివేయాలని ఎస్పీ పేర్కొన్నారు.

