
మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగింది. సందడిగా సాగిన ఈ కార్యక్రమానికి భారత హై కమీషనర్ బీఎన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత పన్నెండు సంవత్సరాలుగా మలేషియాలో ‘మైటా’ చేస్తున్న సహకార కార్యక్రమాలను, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహిస్తున్న పండుగలను కార్యక్రమాలను ఆయన అభినందించారు. 150 పైగా బతుకమ్మలు పేర్చి ఆడడం, 2,000లకు పైగా మంది సమూహంతో చిన్నపాటి తెలంగాణను తలపిస్తుంది అని బీఎన్ రెడ్డి కొనియాడారు.