పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.తాజాగా అమెరికాకు ఇరాన్ సంచలన వార్నింగ్ ఇచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ, పారిశ్రామిక సంస్థలపై ఏప్రిల్ 1 నుండి దాడులు చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) తాజాగా హెచ్చరించింది. ఇరాన్ భూభాగంపై జరిగిన దాడులకు ప్రతీకార చర్యగా ఈ నిర్ణయం ఉండనున్నట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, ఇంటెల్, ఐబీఎం, టెస్లా, బోయింగ్ వంటి 18 దిగ్గజ కంపెనీలను ఐఆర్జీసీ తన లిస్టులో పేర్కొంది.

