మరో రెండు రోజుల్లో ఐపీఎల్ సందడికి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కొందరు బెదిరింపులకు దిగుతున్నారు. కర్నాటక ఎమ్మెల్యే తమకు ఐపీఎల్ టికెట్లు ఇవ్వాలని, మైదానంలో ప్రత్యేక సీట్లు కేటాయించాలని రాష్ట్ర క్రికెట్ సంఘాన్ని ఆదేశించారు. చిన్నస్వామి స్టేడియంలో శనివారం ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌తో ఐపీఎల్ మొదలవ్వనుంది హుంగుండ్ శాసనసభ్యుడైన విజయానంద్ కషపనవర్ గురువారం కర్నాటక క్రికెట్ సంఘానికి టికెట్ల గురించి కొన్ని ఆదేశాలిచ్చారు.

