జపాన్లో సంతానోత్పత్తి రేటు వేగంగా పడిపోతున్న నేపథ్యంలో, ప్రభుత్వం జనాభాను పెంచేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. నా శరీరం కేవలం ప్రసూతి కోసం ఉద్దేశించినది కాదు” అనే నినాదంతో కజియా మరియు మరో నలుగురు మహిళలు జపాన్ కోర్టులో దావా వేశారు. తమకు సంతానం వద్దు అనుకునే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని వారు వాదిస్తున్నారు. జపాన్ సమాజం మహిళలను కేవలం పిల్లలను కనే యంత్రాలుగా చూస్తోందని 29 ఏళ్ల కజానే కజియా ఆరోపిస్తున్నారు.

