ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్యానాలోని కురుక్షేత్రలో జ్యోతిసర్ అనుభవ కేంద్రం, పాంచజన్య శంఖ్ స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత గురు తేజ్ బహదూర్ కు అంకితం చేసిన పుస్తకాన్ని, ప్రత్యేక నాణేన్ని ఆవిష్కరించారు.గురు తేజ్ బహదూర్ 350వ అమరవీరుల వార్షికోత్సవ సభలో ప్రసంగిస్తూ మేము ఎవరినీ బెదిరించము. భయపడము. ఇది మా గురువులు ఇచ్చిన మంత్రం. మేము శాంతిని కోరుకుంటున్నాము, నేడు భారతదేశం పూర్తి శక్తితో ముందుకు సాగుతోంది” అని ప్రధానమంత్రి అన్నారు.

