గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం మూడు కోట్ల 70 లక్షల రూపాయలు విడుదల చేసింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిచొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ మొత్తాన్ని విడుదల చేశాయి.కేంద్ర పర్యాటక శాఖ అధ్వర్యంలో మేడారం చుట్టు పక్కల పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం గిరిజన సర్కూట్ పేరిట గతంలో పలు అభివృద్ధి పనులను కూడా చేపట్టింది.

