అమెరికా, బ్రిటన్ , ఫ్రాన్స్ లు.. ఇజ్రాయేల్ కు మద్దతుగా రంగంలోకి దిగితే.. తీవ్ర పరిణామాలుంటాయని, ఆ దేశం సైనికస్థావరాలు, టార్గెట్ చేయాల్సి వస్తుందని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఒక వేళ తాము యుద్దంలో దిగితే వార్ వన్ సైడ్ అవుతుందని ఇరాన్ కు హెచ్చరికలు జారీచేశారు. ఒకవేళ అమెరికాపై ఇరాన్ దాడికి పాల్పడే దుస్సాహాసమే చేస్తే.. చరిత్ర పుటల్లో కనివినీ ఎరుగని రీతిలో ఇరాన్ పై విరుచుకుపడతామని డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

