
మెటా ప్రణాళికలో తొలి మెరుగైన క్లస్టర్ పేరు ‘Prometheus’ దీని సామర్థ్యం 1341 మెగావాట్లు. ఏఐ మోడళ్లను నిర్మించాలంటే వేలాది గంటల గణన, డేటా శిక్షణ అవసరం అవుతుంది. దీన్ని సాధారణ కంప్యూటర్లతో చేయడం అసాధ్యం. అందుకే సూపర్ క్లస్టర్లు, అంటే భారీ శక్తితో పని చేసే డేటా సెంటర్లు అవసరం అవుతున్నాయి.ఏఐ మోడళ్ల శిక్షణకు సాధారణంగా 12-14 మెగావాట్ల శక్తి అవసరం అవుతుంది. కానీ మెటా అభివృద్ధి చేస్తున్న క్లస్టర్ మాత్రం దానికి పన్నెండు రెట్లు అధిక సామర్థ్యంతో రూపొందించబడుతోంది.