సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ తమ పరువుకు భంగం కలిగించేలా ఆన్లైన్ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సినీ నటి లావణ్య త్రిపాఠి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్స్టాగ్రామ్ @purple_crayon00 అనే అకౌంట్ ద్వారా తనపై, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలు పోస్టులు, కామెంట్లలో దూషణలు, సంబంధాలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని లావణ్య ఫిర్యాదులో తెలిపారు.

