
ఇప్పటికే గజాను అన్ని వైపులా నిర్బంధించిన ఇజ్రాయిల్ పరిమిత స్థాయిలో మాత్రమే మానవతా సాయానికి అనుమతిస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఈ పరిస్థితిపై స్పందించిన ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మానవతా సాయం అందకుండా చేస్తే మరో 48 గంటల్లో 14 వేల మంది చిన్నారులు మరణించే ప్రమాదం ఉందంటూ హెచ్చరించింది.