రాష్ట్ర ప్రభుత్వం మొట్ట మొదటిసారిగా మూడు జిల్లాల్లో విద్యా శాఖ బాధ్యతలను ఐఏఎస్ అధికారులకు అప్పజెప్పింది. తొలిసారిగా ఇలా ఐఏఎస్ అధికారులకు విద్యాశాఖ అధికారులుగా అదనపు బాధ్యతలను అప్పగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా జిల్లాలోని ఖుష్బూగుప్తాకు బాధ్యతలను అప్పగించారు. అటు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా కుమార్ దీపక్‌కు అప్పగించారు. అలాగే జనగామ జిల్లా విద్యా శాఖ అధికారిగా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌కు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పజెప్పింది.

