నాలుగేండ్లకోసారి వచ్చే ప్రపంచ అతిపెద్ద క్రీడా పండుగ ముగిసింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా 17 రోజుల పాటు క్రీడాభిమానులను అలరించిన ఒలింపిక్స్‌కు ఆదివారంతో తెరపడింది. ఒలింపిక్ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా సీన్ నదిలో ప్రారంభ కార్యక్రమాలను నిర్వహించి ‘ఔరా’ అనిపించిన పారిస్.. ముగింపు వేడుకలనూ అదే స్థాయిలో మురిపించింది.తదుపరి 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెల్స్ లో జరుగనున్నట్లు ప్రకటించారు. అంతేకాక ఒలింపిక్ బ్యాటెన్ ను లాస్ ఏంజెల్స్ కు అందజేశారు.