
అంగరంగ వైభవంగా గణేశ్ నిమజ్జన ఉత్సవంకోసం ముంబై మహానగరం సన్నద్ధమవుతున్న వేళ, బాంబు పేలుళ్లు జరుగుతాయని బెదిరింపు సందేశం రావడంతో నగరం ఉలిక్కిపడింది 34 కార్లలో మానవబాంబులను విధ్వంసం సృష్టించేందుకు సిద్ధం చేశామని, అది మొత్తం నగరాన్ని అల్లకల్లోలం చేస్తుందని ఆ బెదిరింపు సందేశంలో పేర్కొన్నారు. ముంబై నగరంలో అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. పార్కింగ్ స్థలాల నుంచి బేస్ మెంట్ ల వరకూ తనిఖీ చేస్తున్నారు. భద్రతా దళాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని, ఎలాంటి ముప్పునైనా దీటుగా ఎదుర్కొంటాయని, సీనియర్ అధికారి విలేకరులతో తెలిపారు.