ఎన్నికల సంఘం గ్యాస్ లైటింగ్ చేస్తూ దేశ పౌరులను మానసిక గందరగోళంలోకి నెడుతోందని ఆరోపిస్తూ ముంబయి పోల్స్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈసీ చేష్టల వల్ల భారత ప్రజాస్వామ్యంపై ప్రజలు విశ్వాస భావనను కోల్పోయారని విమర్శించారు. ఓట్లచోరీకి పాల్పడటం దేశ వ్యతిరేక చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. పోలింగ్‌లో నాసి రకం ఇంకుతో కూడిన మార్కర్లను వినియోగించడంపై విపక్షాలు, ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారంటూ ఓ వార్తా కథనం తన ట్వీట్‌లో రాహుల్‌గాంధీ షేర్ చేశారు

