
అన్నమయ్య జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. సంబేపల్లి మండలం మినుమరెడ్డి గారి పల్లికి చెందిన కవ్వం విజయలక్ష్మి మిస్సెస్ ఇండియాగా ప్రతిభ కనబరిచింది. 50 ఏళ్ల విజయలక్ష్మి చిత్తూరు జిల్లాలో HPCL డీలర్‌గా ఉంటుంది. 25 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళలకు నిర్వహించిన మిస్సెస్ ఇండియా కాంటెస్ట్ రెండు నెలలపాటు జరిగింది. 18 మంది గ్రాండ్ ఫినాలేలో పోటీ పడగా నాలుగు రౌండ్లలో ప్రతిభను కనబరిచి మిస్సెస్ ఇండియాగా విజయలక్షి కిరీటాన్ని దక్కించుకుంది.