
పాకిస్తాన్ వక్రబుద్ధి ఏమాత్రం మారడంలేదు. బోర్డర్లో బరి తెగించి వ్యవహరిస్తూనే ఉంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ పరిస్థితులు కమ్ముకొస్తున్నా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నా ఉగ్ర శిబిరాలే టార్గెట్గా ఇండియన్ ఆర్మీ విరుచుకుపడుతున్నా ఏం చేయాలో అర్థం కాని పాక్ సైన్యం అమాయకులను పొట్టనబెట్టుకుంటోంది. మరోసారి సరిహద్దుల్లో కాల్పులు జరపడంతో 15 మంది భారత పౌరులు మృతి చెందగా.. 50 మందివరకు గాయపడినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఇక.. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. మృతులతోపాటు గాయపడ్డవారంతా పూంచ్ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.