
కేంద్రం ప్రభుత్వ ఒత్తిడి నేపథ్యంలో ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టుల లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మావోయిస్టులతో ఇక ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపదని, వాళ్లు ఆయుధాలు వదిలేసి లొంగిపోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. లొంగిపోయేందుకు మావోయిస్టులు ముందుకు వస్తే తాము స్వాగతిస్తామని హోంమంత్రి అన్నారు.
లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన వివిధ ప్రయోజనాలు అందిస్తామని, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.