మాచర్ల లో ప్రేమ వివాహం చేసుకున్న చౌడేశ్వరి అనే యువతి దారుణ హత్యకు గురైన ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది. బాధితురాలికి రక్షణ కల్పించాల్సిన మాచర్ల CI వెంకటరమణ, ఈ తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యానికి గాను పల్నాడు SP కృష్ణారావు సీఐ వెంకటరమణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు చౌడేశ్వరిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించే క్రమంలో సీఐ వెంకటరమణ భారీగా డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలు లభించాయి. సీఐ ఆమెను అప్పగించిన కొద్దిసేపటికే చౌడేశ్వరి హత్యకు గురికావడం గమనార్హం.

