
గౌరెల్లి నుండి భద్రాచలం వరకు ఔటర్ రింగ్ రోడ్డు కోసం సేకరించిన భూములకు బహిరంగ మార్కెట్ ప్రకారంగా నష్ట పరిహారం చెల్లించాలంటూ భూ బాధితులు డిమాండ్ చేశారు. భూదాన్ పోచంపల్లి మండలంలో ఒక్క ఎకరానికి కోటి రూపాయలకు పైగా బహిరంగ మార్కెట్లో ధర పలుకుతుందని, ప్రభుత్వం ఎకరానికి రూ. 24 లక్షలు మాత్రమే చెల్లిస్తుందన్నారు. త్రిబుల్ ఆర్ కింద ఎకరానికి రూ.47 నుండి 50 లక్షలు చెల్లిస్తుందని బాధితులు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి వద్ద గురువారం ఆవేదన వ్యక్తం చేశారు.