బంగ్లా స్థానాన్ని తమ జట్టుతో రిప్లేస్ చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించగానే స్కాట్లాండ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. తమ జట్టు స్టార్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు షేర్ చేసింది. దీనికి ‘ఎల్లప్పుడూ సిద్దమే’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీనిపై స్కాట్లాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రూడీ లిండ్‌బ్లేడ్ (Trudy Lindblade) శనివారం మాట్లాడారు. తమ జట్టును వరల్డ్కప్ టోర్నీకి ఆహ్వానించినందుకు ఐసీసీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

