
మహిళా సాధికారత, రక్షణ కోసం సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అక్టోబర్ 21వ తేదీ మంగళవారం పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా
పోలీస్ అమర వీరులకు హోం మంత్రి అనిత ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ సమర్థవంతంగా పని చేస్తుందన్నారు. ఆపరేషన్ సేఫ్ పేరిట విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు.