శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి నివాసం వద్ద జరిగిన అనుమానాస్పద ఘటన కలకలం రేపింది. ఓ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు ఆమె ఇంటి ముందుగా నిమ్మకాయలు, తెల్ల నువ్వులు పడేసి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతుండటంతో ఎమ్మెల్యే కుటుంబం భయాందోళనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా తమ నివాసం వద్ద ఇదే తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయని ఎమ్మెల్యే శ్రావణి అనుమానం వ్యక్తం చేశారు. ఓ అసమ్మతి నేత ప్రమేయం ఉండొచ్చని ఆమె వర్గీయులు అనుమానిస్తున్నారు.

