
మంత్రి వివేక్ వెంకటస్వామి రహ్మత్‌నగర్ డివిజన్‌లోని బ్రహ్మశంకర్ నగర్‌లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తనకు అడ్డుగా ఉన్నారని ఒక మైనర్‌తోపాటు ముగ్గురు మహిళలపై వెంకటస్వామి తన అనుచరులతో కలిసి దాడిచేశాడు. స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి వర్గంపై కోపంతో.. ఆయన మనుషులు తనకు అడ్డుగా ఉన్నారని వారిపై దాడికి పాల్పడ్డాడు. తన అనుచరులతో కలిసి వెంకటస్వామి ఇండ్లలోకి దూసుకెళ్లి, మహిళలని కూడా చూడకుండా వివస్త్రలను చేసి కొట్టాడని స్థానిక కాంగ్రెస్ నాయకులే ఆరోపిస్తున్నారు.