హైదరాబాద్లో ఓ మహిళపై ఆమె భర్త, అతని తమ్ముళ్లు, స్నేహితులతో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆందోళనకరమైన నివేదికను జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్వీకరించింది. నిందితులందరినీ తక్షణమే అరెస్టు చేసి, దర్యాప్తు వేగవంతం చేసి బాధితురాలికి తగిన రక్షణ కల్పించేలా చూడాలని తెలంగాణ డీజీపీని ఛైర్పర్సన్ ఆదేశించారు. 7 రోజుల్లోగా వివరణాత్మక కార్యాచరణ నివేదికను ఇవ్వాలని కోరింది. ఈ ఘటన సదరు మహిళ గౌరవానికి, శారీరక స్వేచ్ఛకు, వివాహ పవిత్రతకు తీవ్ర భంగం కలిగించడమేనని పేర్కొంది. ఈ దుశ్చర్యను కమిషన్ తీవ్రంగా ఖండించింది.

