
పాకిస్థాన్ అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య మళ్లీ సంఘర్షణలు మొదలయ్యాయి. మంగళవారం రాత్రి రెండు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు కాల్పులు జరపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు వైపులా డజన్ల మంది సైనికులు మృతి చెందినట్టు సమాచారం. ఉదయం పాకిస్థానే తాజాగా కాందహార్ ప్రావిన్స్‌లో స్పిన్‌బోల్డక్ జిల్లాలో దాడులకు పాల్పడిందని,15 మంది పౌరులు మృతి చెందారని, వందమందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు.