వేగంగా వెళ్తున్న స్లీపర్ బస్సు ఒక వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ఇద్దరు ప్రయాణికులు మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఆ స్లీపర్ బస్సు వేగంగా దూసుకెళ్లింది. అరంద్ఖేడ గ్రామం సమీపంలో ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

