
మరోసారి తమపైకి సైనిక దాడికి దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని భారతదేశానికి పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరికలు వెలువరించారు. పాకిస్థాన్‌తో సైనిక దుస్సాహాసానికి దిగితే తాము ఈసారి ఘాటైన రీతిలో జవాబు ఇచ్చి తీరుతామని ఆయన ఆదివారం ప్రకటించారు. ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగినా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఇటీవలే భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సైనిక దళాల చీఫ్ ద్వివేదిలు వేర్వేరుగా పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ రెండో దశ ఉంటుందని ప్రకటించారు.