
ఉద్రిక్తతలు, ఉత్కంఠగా సాగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. పులివెందులలో మొత్తం ఓట్లు 10 వేల 601 కాగా.. 8 వేల 103 ఓట్లు పోలయ్యాయి. ఒంటిమిట్టలో మొత్తం 24 వేల 606 ఓట్లు ఉండగా.. 20 వేల 681 ఓట్లు పోలయ్యాయి. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు ఒక రౌండులో లెక్కింపు ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా 2 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని వివరించారు.