
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడు పర్యటనకు వెళ్లారు. మధురైలోని మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన మధ్యాహ్నం ఒంటిగంటకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే ఎయిర్‌పోర్టుకు వచ్చి వేచిఉన్న
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్, తమిళనాడు అబ్జర్వర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, తమిళనాడు బీజేపీ నాయకులు పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతం పలికారు.