
తెలంగాణ రాజధాని నగరమైన హైదరాబాద్ శివారులోని మణికొండ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో జరిగిన అగ్ని ప్రమాదం స్థానికంగా కలకలం సృష్టించింది. అక్టోబర్ 12.. ఆదివారం సాయంకాలం సుమారు 4 గంటల సమయంలో..
బి.ఆర్.సి. అపార్ట్మెంట్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు నివాసితులకు గాయాలయ్యాయి. అపార్ట్మెంట్లోని ఒక భాగంలో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటం గమనించిన నివాసితులు భయంతో కిందకు పరుగులు తీశారు. ఈ ఆందోళనకర పరిస్థితులలో.. ప్రమాదాన్ని తప్పించుకునే క్రమంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.