వీధుల్లో తిరిగే కుక్కలను చూసి వీధి కుక్కల మూడ్ ను ఎవరు అర్థం చేసుకోలేరు” అన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై రమ్య తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేశారు. ‘మరి మగవాళ్ల మైండ్ ను కూడా చదవలేం. వాళ్ళు ఎప్పుడు లైంగికదాడి చేస్తారో.. ఎప్పుడు హత్య చేస్తారో తెలియదు. కాబట్టి వాళ్లందరినీ జైలులో పెట్టాలా?’ అని ఇన్స్టాలో ఓ పోస్టు చేశారు. దీంతో కుక్కలతో పోలుస్తావా? అంటూ కొందరు పురుషులు నటి రమ్యపై భగ్గుమంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు

