మంత్రి ప్రయాణిస్తున్న కారుకు ఫుల్లుగా మందు తాగి ఉన్న ఆటో డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు. సైరన్ కొట్టానా ఆటో డ్రైవర్ బాలన్న మంత్రి కాన్వాయ్‌కు సైడ్ ఇవ్వలేదు. ఆఖరికి పోలీస్ ఎస్కార్ట్ వాహనంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేసినా కూడా
రోడ్డుపై అటు ఇటు అడ్డంగా ఆటో తిప్పుతూ కంగారు పెట్టాడు… ఏకంగా మంత్రి ప్రయాణిస్తున్న కారునే ఢీకొట్టబోయాడు ఆటో డ్రైవర్. మద్యం తాగి ఆటో నడిపి… ప్రమాదానికి గురైతే… ఎవరిది బాధ్యత అంటూ అతని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని రోడ్డుపైనే క్లాస్ పీకారు.

