ఖమ్మం పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో నాణ్యత ప్రమాణాలతో కూడిన భోజనం పెట్టడం లేదని పట్టణంలోని బల్లేపల్లి శాఖలో సుమారు 250 మంది హాస్టల్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి కూడా నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో ఆందోళనకు దిగారు. ప్లేట్లు చేతిలో పట్టుకుని క్యాంపస్ నుంచి బయటకు వచ్చేశారు. ఎన్టీఆర్ సర్కిల్ వరకు కాలేజీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్‌లో బైఠాయించిన ఆందోళన చేశారు.

