అధికార కూటమిలోని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు .. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు వెళ్లడం కంటే.. వందే భారత్ రైలు ఎక్కి.. విజయవాడకు చేరుకోవడమే సులభమని విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకోవడానికి దాదాపు రెండున్నర గంటల సమయం పడుతుందని కనెక్టింగ్ రోడ్ల నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

