
యాక్సియం-4 మిషన్లో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుభాంశు శుక్లా టీమ్ మంగళవారం మధ్యాహ్నం 3.01 గంటలకు తిరిగి భూమికి చేరుకుంది. స్పేస్ నుంచి సోమవారం డ్రాగన్ వ్యోమనౌకలో బయలుదేరిన ఈ బృందం.. 22 గంటలకుపైగా ప్రయాణించి కాలిఫోర్నియా సమీపంలోని సముద్రతీరంలో దిగింది. శుభాంశు టీమ్ క్షేమంగా భూమికి చేరుకోవడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు.